హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రైవేట్ కళాశాలలకు బకాయిలు చెల్లించాలి'

KNR: ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. బకాయిలతో కళాశాలలు, పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విదేశీ వర్సిటీలపై కాకుండా స్థానిక విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.