MBNR: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల కలయిక బోనాల వేడుకలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి భూత్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బోనాల వేడుకలకు ఆయన సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నానన్నారు. కార్యక్రమంలో భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాలకోటి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సంస్కృతి సంప్రదాయాల కలయిక బోనాలు వేడుకలు


