NGKL: అచ్చంపేట మండలం దుబ్బ తండాకు చెందిన మూడవత్ గణేష్ హైదరాబాదులో కూలీగా పనిచేస్తూ కుటుంబం పోషించేవాడు. ఉప్పుగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన గణేష్ మృతితో కుటుంబం ఆధారం కోల్పోయిందని మాజీ సర్పంచ్ బౌడ్కా నాయక్ తెలిపారు.
తెలంగాణ
ప్రమాదంలో గాయపడి వలస కూలీ మృతి


