హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోల్కంపేటకు బస్సు కేటాయించాలని వినతి

KMR: లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి ఆర్టీసీ బస్సు కేటాయించాలని సర్పంచ్ దివిటి రమేశ్ డిపో మేనేజర్ దినేష్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత బస్సులు సరిగ్గా రాకపోవడంతో కాలేజీ విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.