హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆయకట్టుకు సాగునీరు అందించాలి: MLA

WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి ఆయకట్టుకు సాగునీరు అందించాలని MLA కేఆర్ నాగరాజు కోరారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులకు ఇబ్బందులు రాకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆరుతడి పంటలు సాగు చేసిన ప్రతి రైతుకు నీరు అందించాలని తెలిపారు.