KDP: రాజంపేట మండలం గుండ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలి తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్ ప్రశాంతి విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. “ఈ టీచర్ మాకొద్దు” అంటూ పాఠశాల ఎదుట నిరసన చేపట్టి గేటుకు తాళం వేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఈ టీచర్ మాకొద్దు’.. స్కూల్‌కు తాళం


