హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతులందరూ నమోదు కావాలి'

ASR: జీకేవీధి మండలంలోని రైతులందరూ ఫార్మర్‌ రిజిస్ట్రీ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఏవో సురేష్ సూచించారు. అసరాడ పంచాయతీలో మంగళవారం నిర్వహించిన ఫార్మర్‌ రిజిస్ట్రీ డ్రైవ్‌లో ఆయన పాల్గొని, మాట్లాడారు. మండలంలో 15,905మంది రైతులకు గాను ఇప్పటివరకు 9,132మంది నమోదు చేసుకున్నారన్నారు. అలాగే గతంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూములు పొందిన రైతులు కూడా నమోదు చేసుకోవాలన్నారు.