KDP: గోపవరం మండలం పీపీ కుంట సమీపంలోని సరిహద్దు కూడలి వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ చాలాకాలంగా పనిచేయడం లేదు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, అమరావతి వైపు వాహనాల రాకపోకలు సాగుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సిగ్నల్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్‌తో ప్రమాదాలు


