హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధి పనులు విస్తృతంగా కల్పించాలి'

PPM: కరువు పరిస్థితుల దృష్ట్యా ఉపాధి హామీ కూలీలకు విస్తృతంగా పనులు కల్పించాలని నవ్యాంధ్రప్రదేశ్ రైతు-కూలీ సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధి పనుల బిల్లులు వెంటనే చెల్లించాలని, ఫేస్ యాప్ హాజరు విధానాన్ని రద్దు చేయాలని కోరారు.