హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికీ టీడీపీలో మంత్రి ఫరూక్

నంద్యాల 1వ వార్డులోని అరుంధతినగర్‌లో ‘ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.