హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

KDP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రభావిత వెంకయ్య కాల్వ గ్రామంలో రౌడీషీటర్లకు కొండాపురం సీఐ రాజా ఆధ్వర్యంలో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.