PPM: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీరఘట్టం పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రవి కుటుంబానికి SBI పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా మంజూరైన రూ.కోటి చెక్కును ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి మంగళవారం అందజేశారు. రవి సతీమణి లలితకు ఎస్‌బీఐ అధికారుల సమక్షంలో ఈ చెక్కును అందించారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన పోలీసు కుటుంబాలకు ప్యాకేజీ భరోసానిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కానిస్టేబుల్ కుటుంబానికి పరిహారం


