AKP: ఏటికొప్పాకలో హస్తకళాకారుల కోసం ఏర్పాటు చేయనున్న హబ్ పార్కు స్థలాన్ని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఏటికొప్పాక కళకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. సంప్రదాయ హస్తకళలను కాపాడటంతో పాటు కళాకారులకు మెరుగైన వసతులు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు హబ్ పార్కు ఉపయోగపడుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
హబ్ పార్క్ ఏర్పాటుకు స్థల పరిశీలన


