SKLM: 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా సోంపేట మండలం కన్నాపురం పంచాయతీలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు గ్రామాల్లో ర్యాలీలు చేపడుతున్నామని సహాయ కంటి వైద్య నిపుణులు డా. లక్ష్మణరావు తెలిపారు. నేత్రదానాన్ని ప్రతి ఒక్కరూ పవిత్ర బాధ్యతగా భావించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేత్రదానంపై అవగాహన ర్యాలీ


