ASR: అరకులోయ మండలం బస్కి పంచాయతీలో సీపీఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు పర్యటించారు. గ్రామాల్లో బురద, నీటి నిల్వలతో దోమలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రతి కుటుంబానికి నాలుగు జతల దోమతెరలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలకు నిధులు కేటాయించాలని కోరారు. మొర్రిగూడలో 150 కుటుంబాల నీటి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పంచాయతీలో సమస్యలు పరిష్కరించాలి'


