హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొబైల్ పోతే CEIR పోర్టల్లో ఫిర్యాదు చేయండి: సీఐ

తూ.గో: ఫోన్ పోగొట్టుకుంటే వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంటుందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ధవళేశ్వరం CI టి. గణేశ్ సూచించారు. మొబైల్ పోయినా లేదా చోరీకి గురైనా దిగులు పడకుండా CEIR పోర్టల్ ద్వారా తిరిగి పొందవచ్చని తెలిపారు. ప్రమాదం జరగకముందే బ్యాంకింగ్, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి డిజిటల్ చెల్లింపు ఖాతాలను వెంటనే తాత్కాలికంగా బ్లాక్ చేయించుకోవాలన్నారు.