అనకాపల్లి మండలం దర్జీనగర్‌లో ప్రభుత్వ, ప్రజా స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు డిమాండ్ చేశారు. అధికారుల, కూటమి నాయకుల అండతోనే అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఆక్రమణలు నిజమని తేలితే నిర్మాణాలను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి'


