హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరారీలో ఉన్న జీవిత ఖైదీ అరెస్ట్

W.G: హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చి పరారైన ఉయ్యూరి వెంకట రమణను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సుధాకర్ రావు మంగళవారం నరసాపురంలో తెలిపారు. సాంకేతిక ఆధారాలతో హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి నాలుగు రోజుల పాటు గాలించి పట్టుకున్నామని చెప్పారు. ఆగస్టు 24న హైకోర్టులో హాజరుపరచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.