హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీటీడీ ప్రసాదం కౌంటర్ల కోసం 50 కంప్యూటర్లు అందజేత

తూ.గో: టీటీడీ ప్రసాదం కౌంటర్ల కోసం కడియం మండలం మాధవరాయుడుపాలేనికి చెందిన దాత అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ (చంటి) రూ.60 లక్షల విలువైన 50 కంప్యూటర్లను అందజేశారు. టీటీడీ AEO వెంకయ్య చౌదరికి వీటిని అప్పగించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు దాత చంటిని సత్కరించారు. ఈ కంప్యూటర్లను టీటీడీ ప్రసాదం కౌంటర్ల అవసరాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.