హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరికలు

విజయనగరం 26వ డివిజన్‌కి చెందిన వైసీపీ నాయకులు లొడగల బుజ్జి, సబ్బి రమేష్, లొడగల నరేష్, జామి కొండమ్మ, పట్నాల శివతో పాటు 60 కుటుంబాలు మంగళవారం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ మేరకు వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరామన్నారు.