హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప అభివృద్ధికి భారీ నిధులు: కమిషనర్

KDP: జిల్లా కార్పొరేషన్ అభివృద్ధికి సుమారు రూ.200 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉందని కమిషనర్ భవాని ప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో డ్రైనేజీలు, రోడ్లు, పార్కులు, స్ట్రీట్ లైట్ల అభివృద్ధి చేపడతామన్నారు. టెండర్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. క్లీన్ కడప కోసం తడి, పొడి చెత్తను వేరు చేసి ప్రజలు సహకరించాలని కోరారు.