హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలిదశలో గుర్తిస్తే క్యాన్సర్‌కు పూర్తిగా చికిత్స: ఎమ్మెల్యే

కోనసీమ: క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో శ్రీ వాసవీ మహాత్మా గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో అపోలో క్యాన్సర్ సెంటర్ సహకారంతో నిర్వహించిన ఉచిత క్యాన్సర్, రక్త సంబంధిత వ్యాధుల నిర్ధారణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.