హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోరుమిళ్లలో దాడి ఘటన.. వ్యక్తి మృతి

KDP: పోరుమామిళ్ల మండలం బొప్పాపురంలో భార్య లక్ష్మీదేవి, కుమార్తె కృష్ణకుమారి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోరుమిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.