హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేపల మార్కెట్ నిర్మాణానికి స్థల పరిశీలన

AKP: అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో నూతన చేపల మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో ఆధునిక వసతులతో మార్కెట్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. మార్కెట్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.