హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో టెన్షన్

అన్నమయ్య: మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రెండో రోజు మంగళవారం కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. సోమవారం కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు నేతృత్వంలో 14 మంది అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎస్‌ఆర్‌ఓ, సిబ్బంది వద్ద రూ.1.25 లక్షల నగదును గుర్తించినట్లు సమాచారం. రెండో రోజు కూడా సోదాలు కొనసాగడంతో కార్యాలయంలో ఉత్కంఠ నెలకొంది.