హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కప్పలదొడ్డిలో మంగళ గౌరీ వ్రతం

కృష్ణా: శ్రావణ మాసం సందర్భంగా గూడూరు మండలం కప్పలదొడ్డిలో మంగళవారం సామూహిక మంగళ గౌరీ వ్రతాన్ని నిర్వహించారు. కప్పలదొడ్డి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సంక్షేమం, సకల సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ నోములు ఆచరించారు.