హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

కృష్ణా: హనుమాన్ జంక్షన్‌లోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. వేదమంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యే దంపతుల పేరున ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.