CTR: యాదమరి మండలంలోని లగడపాటూరు గ్రామానికి చెందిన సరోజమ్మ (70) గత నెల 12న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరోజమ్మ ఆచూకీ తెలిసిన వారు 8790717075 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధురాలు అదృశ్యం..!


