కృష్ణా: మిలాద్ ఉన్ నబి పండుగను మతసామరస్యానికి ప్రతీకగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పెడన ఎస్‌ఐ సత్యనారాయణ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు. పరస్పరం గౌరవించుకుంటూ సోదరభావంతో పండుగ జరుపుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు: ఎస్‌ఐ


