సత్యసాయి: రొద్దం మండలం కొగిర గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బోయ ఆంజనేయులు ప్రమాదవశాత్తు మృతి చెందగా, ఆయన కుటుంబానికి పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా కింద మంజూరైన రూ.5 లక్షల పత్రాలను మంత్రి సవిత అందజేశారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి కుటుంబాలను ఆదుకోవడం తమ బాధ్యత అని చెప్పారు. టీడీపీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్త భరోసాగా నిలుస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.5 లక్షల బీమా పత్రాలు అందజేసిన మంత్రి సవిత


