హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాంతి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట

సత్యసాయి: కదిరి ఆర్డీవో కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై జరిగిన శాంతి కమిటీ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. పట్టణంలో గణేష్ ఉత్సవాలను 7 రోజుల పాటు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేలా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.