హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటి వద్దకే రేషన్ సరుకులు: జాయింట్ కలెక్టర్

ATP: జిల్లాలో 65 ఏళ్లు పైబడిన 77,545 మంది రైస్ కార్డుదారులు, వికలాంగులు, మంచానికే పరిమితమైన రోగులకు ఈ నెల 26-31 వరకు ఇంటివద్దకే నిత్యావసర సరుకులు అందజేస్తారు. షాపులకు రాకుండా డీలర్లే సరుకులు అందించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ ఆదేశించారు. అలాగే సమస్యలుంటే 8500292992కు సంప్రదించాలని ప్రజలకు సూచించారు.