NDL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో నంద్యాల జిల్లా ఎన్నికల రోల్ పరిశీలకురాలు ప్రశాంతి పూజలు నిర్వహించారు. మంగళవారం క్షేత్రానికి వచ్చిన వీరికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ కామేశ్వరీ సమేత మహానంది ఈశ్వర స్వామివార్లకు అభిషేక, అర్చన పూజలు చేశారు. వేద పండితులు రవిశంకర అవధాని వేద ఆశీర్వచనం అందించగా అధికారులు జ్ఞాపికతో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మహానందిలో ఎన్నికల అధికారులు


