హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్టేషన్‌లో ఓపెన్ హౌస్

SKLM: ఐటీడీఏ సీతంపేట ప్రాజెక్టు అధికారి సూచనల మేరకు మంగళవారం పాతపట్నం పోలీస్టేషన్‌లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. బొమ్మిక జీటీడబ్ల్యూఏజీహెచ్ఎస్‌కు చెందిన 50 మంది బాలికలు పాల్గొన్నారు. సీఐ వెంకటరావు పోలీస్ స్టేషన్ విధులు, దర్యాప్తు, ప్రజాసేవలు, సైబర్ మోసాలు, మైనర్లు వాహనాలు నడపడంపై చట్టపరమైన అంశాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.