హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హోటళ్లపై కార్పొరేషన్ అధికారుల దాడులు

VZM: విజయనగరం రింగ్‌రోడ్డులోని పలు హోటళ్లపై మంగళవారం కార్పొరేషన్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు, నాణ్యత లేని ఆహార పదార్థాలను గుర్తించి పారవేశారు. పరిశుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని హోటల్ నిర్వాహకులను అధికారులు హెచ్చరించారు.