హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైవర్ నిజాయితీ: బ్యాగ్‌ అందజేత

సత్యసాయి: నెల్లూరు నుంచి పుట్టపర్తి వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో పోగొట్టుకున్న బ్యాగ్‌ను ప్రయాణికుడికి సురక్షితంగా అందజేసి డ్రైవర్ డి.రమణప్ప నిజాయితీ చాటుకున్నారు. బస్సులో లభించిన బ్యాగ్‌ను ఆయన పుట్టపర్తి డిపో మేనేజర్ షేక్ ఇనయతుల్లాకు అందించారు. అందులో ఉన్న డెల్ ల్యాప్‌టాప్, ట్యాబ్ ఆధారంగా ప్రయాణికుడు మనోజ్ కుమార్‌కు అందజేశారు.