హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్ల అద్దాలు ద్వంసం.. ఎస్సై పరిశీలన

ప్రకాశం: చీమకుర్తి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన అపార్ట్‌మెంట్‌లో పార్క్ చేసిన ఆరు కార్లు గుర్తు తెలియని దుండగులు అద్దాలు పగలగొట్టిన విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లు స్థానికుల సమాచారం. ఈ సంఘటనపై స్థానిక ఎస్సై సంఘటన స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో ఆకతాయి చేసిన పనిగా గుర్తించారు.