హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

E.G: గోకవరం మండలం తంటికొండ వెంకటగిరి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 28వ తేదీ 3వ శుక్రవారం ఉచిత సామూహిక వర లక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయం ఛైర్మన్ అచ్చన్న దొర తెలిపారు. వ్రతాల్లో పాల్గొనే మహిళలకు ఉచితంగా పూజా సామాగ్రి అందజేస్తామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.