KRNL: సి. బెళగల్ ముడుమాల ఎస్సీ కాలనీలో రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తుండటంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మించి పదేళ్లు గడిచినా ఇరువైపులా కాలువలు ఏర్పాటు చేయలేదని వాపోతున్నారు. మురుగునీరు రోడ్డుపై పారడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఇవాళ గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపైనే మురుగునీరు.. పట్టించుకోని అధికారులు


