హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆపరేషన్‌కు భయపడి వ్యక్తి ఆత్మహత్య

WG: తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిడుతూరి పోలరాజు (62) కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తాళ్లపుంత రోడ్డుకు చెందిన ఆయన హెర్నియా ఆపరేషన్ కోసం ఈ నెల 22న ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా భయంతో సమీపంలోని కాలువలో దూకేశారు. ఈ ఘటనపై తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.