హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ ఆందోళన

KDP: పులివెందుల మండలం రాయలాపురం వద్ద ఆర్టీసీ బస్సులను మంగళవారం ప్రయాణికులు,విద్యార్థులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. ప్రొద్దుటూరు- పులివెందుల మార్గంలో పాఠశాల,కళాశాలల వేళల్లో బస్సులు ఆపడం లేదని వాపోయారు. దీంతో సమయానికి విద్యాసంస్థలకు చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి బస్సులు రాయలాపురంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.