హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టైక్వాండలో ఎలమంచిలికి 9 పథకాలు

AKP: శ్రీకాకుళం వైఎస్సార్ కళ్యాణ మండపంలో జరిగిన రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో ఎలమంచిలి సత్య స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు 9 పతకాలు సాధించారు. అనకాపల్లి జిల్లా తరపున ఆడిన వీరిలో హర్షిత బంగారు పతకం, సింహాద్రి రజతం గెలిచారు. ఎం.రిత్విక, రిజ్వానా బేగం, గాయత్రి వర్షిణి, ఆర్.విష్ణువర్ధన్, రవితేజ, జగన్, సాయికుమార్ కాంస్య పతకాలు సాధించారని కోచ్ తెలిపారు.