రోలుగుంట మండలం కె.నాయుడుపాలెం గ్రామంలో మంగళవారం ఎంపీడీవో నాగేశ్వరరావు పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త సంపద కేంద్రాన్ని సందర్శించి వర్మీ కంపోస్టు తయారీ విధానం, తడి-పొడి వ్యర్థాల నిర్వహణను పరిశీలించారు. చెత్త సేకరణ రిక్షాల పనితీరును సమీక్షించి, గ్రామంలో పారిశుధ్య లోపం లేకుండా చూడాలని సిబ్బందికి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
చెత్త సంపద కేంద్రంలో MPDO ఆకస్మిక తనిఖీ


