హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కృష్ణా: మచిలీపట్నం కొత్త హౌసింగ్ బోర్డు కాలనీ చిట్టిపాలెం రోడ్డులోని సత్య కళ్యాణ మండపం సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెడన బ్రహ్మపురానికి చెందిన మువ్వల ప్రసాద్ (45) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.