హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధరలు పెంపు.. ప్రజలు ఎలా బతకాలి'

పార్వతీపురం: నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏఐసీయూటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.వి.ఎస్‌. కుమార్ అన్నారు. పెరుగుతున్న ధరలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ధరల నియంత్రణపై దృష్టి సారించకుండా ప్రజలపై భారాన్ని మోపుతోందని విమర్శించారు.