ASR: జీకేవీధి మండలం నేలపాడు రహదారి నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఈ రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఏడాది కిందట నిర్మాణం ప్రారంభమైంది. అయితే రోడ్డు చదును చేసి కంకర కుప్పలు వేసి వదిలేశారని స్థానికులు తెలిపారు. దీంతో వర్షాలు పడితే రోడ్డు బురదగా మారుతోందని, కంకరతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు.
ఆంధ్రప్రదేశ్
నేలపాడు రహదారిపై నిర్మాణంలో నిర్లక్ష్యం!


