హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

NDL: పాములపాడులో ఈ నెల 28న నిర్వహించనున్న ప్రత్యేక కలెక్టర్ గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాట్లను నందికొట్కూరు ఎమ్మెల్యే గీత జయసూర్య పరిశీలించారు. జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో నిర్వహించే కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను నేడు ఆదేశించారు. కొత్తపల్లి, పాములపాడు మండలాల ప్రజలు ఈ ప్రత్యేక గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేయాలన్నారు.