హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్ధవీడు గ్రామస్తులకు రేపు డెడ్ లైన్!

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. అర్ధవీడు(M) లక్ష్మీపురం, కృష్ణానగర్‌లో కొందరికి R&R ప్యాకేజీ అందలేదు. అయినప్పటికీ అందరూ బుధవారం సాయంత్రం లోపు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఆ తర్వాత కరెంట్ సరఫరా నిలిపి వేస్తామని, గ్రామాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని ‘పరిహారం ఇవ్వకుండా ఎక్కడికి వెళ్లాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.