హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సామూహిక కుంకుమ పూజలు

VZM: గజపతినగరంలోని భగవాన్ సత్యసాయి బాబా మందిరం ప్రాంగణంలో 201 మహిళలచే సామూహిక కుంకుమ పూజ సత్యసాయి సేవాసమితి కన్వీనర్ వెంకటేష్ పర్యవేక్షణలో జరిగింది. శ్రావణమాసం పురస్కరించుకొని మంగళవారం వరలక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. అర్చకులు శ్రీధర్ వేద మంత్రాల నడుమ మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించారు. జిల్లా నేతలు కమలసాయి విజయలక్ష్మి పాల్గొన్నారు.