అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. అరెస్టయిన వారిలో నలుగురు లక్కిరెడ్డిపల్లి మండలానికి చెందినవారు కాగా, ఒకరు కుప్పం వాసి అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
లక్కిరెడ్డిపల్లిలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్


